సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా ఎన్ వి రమణ పేరు సిఫారసు

Update: 2021-03-24 07:06 GMT

కీలక పరిమాణం. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బొబ్డే సిఫారసు చేశారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ శుక్రవారం జస్టిస్ బాబ్డేకు ఈ మేరకు లేఖ రాశారు. ప్రస్తుత సీజెఐ బొబ్డే ఏప్రిల్ 23న పదవి విరమణ చేయనున్నారు. బొబ్డే సిఫారసును కేంద్ర న్యాయ శాఖ హోం శాఖకు పంపనుంది. హోం శాఖ పరిశీలన అనంతరం ప్రధాని దగ్గరకు చేరుకుంటుంది. అక్కడ నుంచి ఆమోదం కోసం రాష్ట్రపతికి సిఫారసు చేస్తారు. రాష్ట్రపతి ఆమోదం వెంటనే ఇది అమల్లోకి వస్తుంది. అంతా అనుకున్న షెడ్యూల్ ప్రకారం పూర్తయితే జస్టిస్ రమణ ఏప్రిల్ 24న ప్రమాణ స్వీకారం చేస్తారు.

1957 ఆగస్టు 27న జన్మించిన జస్టిస్ రమణ 2022 ఆగస్టు 26 వరకు సీజేఐగా కొనసాగుతారు. ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు నుంచి సీజేఐగా నియమితులయ్యే రెండో సీజేఐగా ఆయన రికార్డు సృష్టించబోతున్నారు. రమణ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా 2000 జూన్‌లో నియమితులయ్యారు. అనంతరం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. 2014 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రస్తుతం సుప్రీంకోర్టులో జస్టిస్ ఎస్ఏ బాబ్డే తర్వాత సీనియర్ మోస్ట్ జడ్జిగా ఉన్నారు.

Tags:    

Similar News