కత్తి కార్తీకపై చీటింగ్ కేసు

Update: 2020-10-16 15:20 GMT

ఎన్నికల బరిలోకి కత్తి కార్తీక ఎంట్రీ. ఆమెపై చీటింగ్ కేసు నమోదు. ఈ రెండింటికి సంబంధం ఉందో లేదో తెలియదు కానీ..ఆమెపై కేసు నమోదు ఇప్పుడు ఆసక్తిరేపే అంశంగా మారింది. టీవీ యాంకర్ అయిన కత్తి కార్తీక ఇప్పుడు తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్న దుబ్బాక ఉప ఎన్నిక బరిలో నిలిచారు. అది కూడా ఇండిపెండెంట్ గా. తాజాగా ఆమెపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై చీటింగ్‌ కేసు నమోదు అయ్యింది.

భూమి వివాదాన్ని సెటిల్ చేస్తా అంటూ కార్తీకతో పాటు ఆమె అనుచరులు కోటి రూపాయల మోసానికి పాల్పడ్డట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. అమీన్‌పూర్‌ వద్ద 52 ఎకరాల భూమిని ఓ ప్రైవేట్ కంపెనీకి ఇప్పించేందుకు కార్తీక మధ్యవర్తిత్వం వహించినట్లు బాధితుడు ఆరోపిస్తున్నారు. తన దగ్గర నుంచి కోటి రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చేయించుకున్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడు ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News