మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు కూడా 'పీకుడు భాష' క్లబ్ లో చేరారు. ఇప్పటి వరకూ ఏపీ మంత్రి కొడాలి నాని, ఇతరులు మాత్రమే ఆ భాష వాడేవారు. ఇప్పుడు చంద్రబాబు కూడా మరి ఆ రేంజ్ కు ఎందుకు వచ్చారో ఆయనకే తెలియాలి. అమరావతి రైతుల ఉద్యమం ఏడాది పూర్తి అయిన సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ మాట్లాడుతూ ఇన్ సైడర్ ట్రేడింగ్ ..ఇన్ సైడర్ ట్రేడింగ్ అన్నారు..19 నెలలు అయింది ఏమి పీకారు?. ఇళ్ళు కట్టుకోలేదు కట్టుకోలేదు అంటున్నారు ఇళ్ళు కట్టిన జగన్ పీకింది ఏంటి అంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని వ్యాఖ్యలపైనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కానీ చంద్రబాబు కూడా అదే భాష మాట్లాడటంతో ఇప్పుడు ఆయనకు ఏపీ మంత్రులు మళ్ళీ అదే భాషలోనే సమాధానం ఇచ్చారు. మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలు మీడియాతో మాట్లాడుతూ 'నువ్వు ఏ బొక్కలో దాక్కున్నా నీ ముసలీయన్నీ పీక చేతిలో పెట్టే రోజు వస్తుంది.
నీ వయస్సుకు తగ్గ మాటలేనా? అవి. జగన్ రెడ్డి పీకటంమొదలుపెట్టడం మొదలుపెట్టడగానే దోచుకున్న కోట్లు గుమ్మరించి నల్లకోట్ల వెనక దాక్కున్నది ఎవరు?. తొందర్లోనే అన్నీ పీకి చేతిలో పెట్టే రోజు వస్తుంది. చంద్రబాబు ముందుంది ముసళ్ళ పండడ అంటూ నాని వ్యాఖ్యానించారు. కొడాలి నాని మరోసారి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఫేక్ జాతీయ పార్టీ అని, ఆయన ఫేక్ జాతీయ అధ్యక్షుడని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌లో ఓడిపోయి ఎన్టీఆర్ కాళ్ల దగ్గర చేరి ఆయనకే వెన్నుపోటు పొడిచారని నిప్పులు చెరిగారు. ''అమరావతి పేరుతో గ్రాఫిక్స్ చూపించి రైతులను మోసం చేశారు. 14 ఏళ్లు అధికారంలో ఉండి దుర్గమ్మకు ఎప్పుడైనా పట్టువస్త్రాలు సమర్పించారా?. చంద్రబాబు ఇంద్రకీలాద్రిపై క్షుద్రపూజలు చేయించారు.
దుర్గమ్మ శాపంతోనే చంద్రబాబు 23 సీట్లకు పరిమితమయ్యారు. దుర్గమ్మ చల్లగా చూసింది కాబట్టే.. వైఎస్ జగన్ సీఎం అయ్యారు. మంగళగిరిలో లోకేష్‌ను ఓడించారు. రాబోయే ఎన్నికల్లో కుప్పంలో బాబును ఓడిస్తారు. చంద్రబాబుకు సిగ్గు, శరం లేదు. హెరిటేజ్ కోసం సహకార వ్యవస్థను నాశనం చేశారు. హెరిటేజ్‌కు అన్ని కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి?. చంద్రబాబు పందికొక్కులా గ్రామీణ పేద మహిళల డబ్బులు దోచేశారని'' మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నువ్వు ఒక దొంగవి అంటూ చంద్రబాబు పై ధ్వజమెత్తారు. ఈ దొంగ, నక్క ఎన్టీఆర్ దగ్గర కూడా ఇలాగే పడుకున్నాడు అని విమర్శించారు.