కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం నాడు పార్లమెంట్ ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏదైనా కీలక అంశం ఉంది అంటే వ్యాక్సిన్ కు నిదులు కేటాయింపు. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో వ్యాక్సిన్ అవసరాల కోసం 35 వేల కోట్ల రూపాయలు కేటాయించారు.
అవసరం అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియకు మరిన్ని నిధులు కేటాయించటానికి కూడా సిద్ధంగా ఉన్నటు పేర్కొన్నారు. వైద్యం, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా ఈ రంగ బడ్జెట్ ను 2.33 లక్షల కోట్ల రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపారు.