స్టాక్ మార్కెట్లో 'బడ్జెట్ దూకుడు'

Update: 2021-02-01 11:55 GMT

కేంద్ర బడ్జెట్ పై సామాన్యులు..మధ్య తరగతి పెదవి విరుస్తున్నా స్టాక్ మార్కెట్ మాత్రం దూకుడు చూపించింది. ఏకంగా ఒక్కరోజులో 2300 పాయింట్లు లాభపడింది. పలు రంగాలకు చెందిన షేర్లు జూమ్ అంటూ దూసుకెళ్ళాయి. మార్కెట్లకు బీమా రంగంలో ఎఫ్ డిఐ పరిమితి పెంపు, మౌలికసదుపాయాల రంగంపై భారీ వ్యయం, సంస్కరణల కొనసాగింపు, పీఎస్ యూల ప్రైవేటీకరణ వంటి అంశాలు మదుపర్లలో జోష్ నింపాయి.

దీంతోపాటు బడ్జెట్లో వ్యాక్సిన్ కోసం 35 వేల కోట్ల రూపాయలు కేటాయించటం సెంటిమెంట్ ను మెరుగుపర్చింది. అందుకే పలుషేర్లు లాభాలతో దూసుకెళ్ళాయి. మరి రాబోయే రోజుల్లో కూడా ఇదే దూకుడు ఉంటుందా? . తిరిగి కరెక్షన్ ప్రారంభం అవుతుందా అన్నది వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News