సెన్సెక్స్..నిఫ్టీ అల్ టైం హై

Update: 2024-09-24 05:14 GMT

స్టాక్ మార్కెట్ లో బుల్ ర్యాలీ కొనసాగుతోంది. మంగళవారం ఉదయం మార్కెట్ లు ఫ్లాట్ గా మొదలైనా తర్వాత మాత్రం లాభాల్లోకి వచ్చాయి. ఉదయం పదిన్నర సమయంలో బిఎస్ఈ సెన్సెక్స్ తొలిసారి 85000 పాయింట్ల మార్కును అదిగిమించింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా లైఫ్ టైం హై 25975 పాయింట్లకు చేరింది. గత శుక్రవారం తొలిసారి 84000 పాయింట్లను అధిగమించిన సెన్సెక్స్ అతితక్కువ సమయంలో అంటే కేవలం రెండు ట్రేడింగ్ సెషన్స్ లోనే మరో రికార్డు స్థాయి 85000 పాయింట్స్ ను అధిగమించటం విశేషం.

అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నా కూడా భారతీయ మార్కెట్ లు మాత్రం దూసుకెళుతూనే ఉన్నాయి. మంగళవారం ప్రదానంగా స్టీల్ స్టాక్స్ మంచి లాభాలు సాధించాయి. టాటా స్టీల్, హిండాల్కో , అదానీ ఎంటర్ప్రైజెస్, పవర్ గ్రిడ్ తదితర షేర్లు లాభాలతో కొనసాగుతున్నాయి. ఇప్పటిలో భారతీయ మార్కెట్ల ర్యాలీ ఆగే అవకాశం లేదు అని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఏ షేర్లు పడితే అవి కాకుండా మంచి ట్రాక్ రికార్డు ఉన్న కంపెనీ షేర్లను మాత్రమే కొనుగోలు చేయాలనీ వాళ్ళు సూచిస్తున్నారు.

Tags:    

Similar News