దేశ స్టాక్ మార్కెట్ చరిత్రలో సంచలనం. సెన్సెక్స్ తొలిసారి 50 వేల మార్క్ ను దాటేసింది. ఓ వైపు కరోనా భయాలు ఉన్నా కూడా మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త ర గరిష్టాలు నమోదు అవుతూ వస్తున్నాయి. అందులో భాగంగానే గురువారం నాడు సెన్సెక్స్ రికార్డు స్థాయిలో 50వేల మార్క్ ను దాటేసింది. ప్రారంభం నుంచి మార్కెట్లో గ్రీన్ లోనే కొనసాగాయి.
పది గంటల సమయంలో సెన్సెక్స్ 250 పాయింట్ల లాభంతో 50042 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మరి చివరి వరకూ ఈ జోరు ఉంటుందా? లేక మధ్యలో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరిస్తారా అన్నది వేచిచూడాల్సిందే. అమెరికా నూతన అధ్యక్షుడి జో బైడెన్ బాధ్యతలు స్వీకరించటంతో ఐటి రంగంతోపాటు పలు భారతీయ కంపెనీలకు మేలు జరిగే అవకాశం ఉందనే అంచనాలు కూడా ఈ ర్యాలీకి కారణంగా చెబుతున్నారు.