బిఎస్ఈ రికార్డు

Update: 2024-04-08 08:58 GMT

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్ఈ)లో కొత్త రికార్డు నమోదు చేసింది. బిఎస్ఈ లోని మొత్తం లిస్టెడ్ కంపెనీల షేర్ల విలువ తొలిసారి 400 లక్షల కోట్ల రూపాయలను అధిగమించింది. బిఎస్ఈ లో లిస్టెడ్ షేర్ల విలువ కొత్త రికార్డు కు చేరటమే కాదు...బిఎస్ఈ సెన్సెక్స్ కూడా సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో 74 ,817 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. ఇది కూడా లైఫ్ టైం హై. 2014 మార్చి లో మొదటి సారి బిఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజషన్ వంద లక్షల కోట్ల రూపాయలకు చేరగా...2021 లో ఇది 200 లక్షల కోట్లకు పెరిగింది. 2023 జులై 300 లక్షల కోట్లకు చేరిన బిఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజషన్ ఇప్పుడు ఏకంగా తొలిసారి 400 లక్షల కోట్లకు పెరిగింది.

                                                   2023 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు బిఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజషన్ 57 శాతం మేర పెరిగింది అంటే దేశీయ మార్కెట్ లు ఏ రేంజ్ లో దూసుకెళుతున్నాయో చూడోచ్చు. ఒక్క బిఎస్ఈ నే కాకుండా...నిఫ్టీ కూడా సోమవారం నాడు అల్ టైం హై 22630 పాయింట్లకు పెరిగింది. ఎన్నికల సమయంలో కూడా మార్కెట్ లు దూసుకెళ్ళటం పరిశీలకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది అనే చెప్పాలి. అయితే తాజాగా మార్కెట్ పెరగటానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్ ల నుంచి అందిన సానుకూల సంకేతాలే అని మార్కెట్ వర్గాలు చెపుతున్నాయి. 

Tags:    

Similar News