ఇన్వెస్టర్లు విలవిల

Update: 2025-04-07 04:42 GMT
ఇన్వెస్టర్లు విలవిల
  • whatsapp icon

దేశీయ స్టాక్ మార్కెట్లో సోమవారం నాడు రక్తపాతం జరిగింది అనే చెప్పాలి. భారీ నష్టాలతో షేర్లు అన్ని పతనం అయి ఎర్రగా మారిపోయాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై విధించిన ప్రతీకార సుంకాల ప్రభావం అమెరికా మార్కెట్లతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లపై పడింది. ట్రంప్ దెబ్బకు అమెరికా మార్కెట్ లు సైతం  అతలాకుతలం అవుతున్నాయి. అయినా సరే ట్రంప్ మాత్రం మార్కెట్ పతనం అయినా కూడా ఏమి కాదు అమెరికా మాత్రం సంపన్నం అవుతుంది అంటూ చెపుతూ వస్తున్నారు. డోనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రభావం తో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ లు కుప్పకూలాయి. ఆ ప్రభావం భారతీయ మార్కెట్ల పైన కూడా పడింది.

                           సుంకాల విషయం వెలుగులోకి వచ్చి కొన్ని రోజులు అయినా కూడా ప్రపంచ మార్కెట్ల పతనం కారణంగా భారతీయ మార్కెట్ లు కూడా భారీ నష్టాలను చవి చూశాయి. గత కొన్ని సంవత్సరాల కాలంలో మార్కెట్ లు ఒక రోజు ఇంత భారీ ఎత్తున పతనం అయిన సందర్భం లేదు. ప్రీ ట్రేడింగ్ సెషన్ లో అయితే బిఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా దగ్గర దగ్గర నాలుగు వేల పాయింట్ల మేర నష్టపోయింది. సరిగ్గా పది గంటల సమయంలో సెన్సెక్స్ 2750 పాయింట్ల నష్టంతో 72615 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మరి కొంత కాలం మార్కెట్లో ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది అని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక్క భారత్ మార్కెట్ లే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అన్ని మార్కెట్ లు భారీ నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి.

Tags:    

Similar News