వాస్తవానికి రజని కాంత్ స్వరాష్ట్రం కర్ణాటకే. కానీ అయన తమిళనాడు లో సెటిల్ అయి అక్కడే సూపర్ స్టార్ గా ఎదిగిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తల్లి కూడా ఆ రాష్ట్రానికి చెందిన వారే. ఇలా పలు అంశాలతో బీజేపీ వీళ్లద్దరిని తెలివిగా వాడు కునే ప్రయత్నం చేస్తుంది అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. ఇది ఎంత మేరకు ఫలితాన్ని ఇస్తుందో తెలియాలి అంటే ఇంకా చాలా రోజులు ఎదురు చూడాల్సిందే. ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఎన్టీఆర్ నేరుగా జోక్యం చేసుకొనే ఛాన్స్ లేదు. ఎందుకంటే అయన ఒకప్పుడు తన తాత పెట్టిన తెలుగు దేశం కోసం పని చేసారు. ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఎన్నికల సమయంలో బీజేపీ తరపున కర్ణాటకలో ఒక పిలుపు ఇవ్వటానికి ఎన్టీఆర్ ముందుకు వస్తారా..ఒక వేళ బీజేపీ అక్కడ ఈ హీరో ఇమేజీని వాడుకోవాలని డిసైడ్ అయితే ఎన్టీఆర్ తప్పించుకోగలరా అన్న చర్చ కూడా సాగుతోంది. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. అప్పటివరకు వేచి చూడాల్సిందే.