బిగ్ న్యూస్..ఫైజర్ వ్యాక్సిన్ కు యూకె ప్రభుత్వ అనుమతి

Update: 2020-12-02 07:54 GMT

కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి ఇది కీలక పరిణామం. ఫైజర్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి యూకె ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రపంచంలోనే ఇలా అత్యవసర వినియోగానికి ఆమోదం పొందిన తొలి వ్యాక్సినే ఇదే అని ఫైజర్ ప్రకటించింది. యూకెకు చెందిన నియంత్రణా సంస్థ అయిన మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్ఆర్ఏఐ) ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫైజర్, బయోఎన్ టెక్ లు సంయుక్తంగా ఈ వ్యాక్సిన్ ను అబివృద్ధి చేసిన విషంయ తెలిసిందే. అమెరికా కంటే ముందు యూకె ప్రభుత్వం దీనికి అనుమతి ఇవ్వటం మరింత ఆసక్తిని రేపుతోంది. అమెరికాకు చెందిన ఎఫ్ డిఏ కూడా ఈ నెల 10న జరిగే సమావేశంలో అత్యవసర వినియోగానికి ఆమోదంపై నిర్ణయం తీసుకోనున్న తరుణంలో యూకె అనుమతి ఇవ్వటం మరింత ఆసక్తి రేపుతోంది. ఫైజర్ తక్షణమే ఫస్ట్ డోసులను యూకెకు పంపనుంది.

ఇది కోవిడ్ 19ను ఎదుర్కొనేందుకు కీలక అడుగుగా ఫైజర్ ప్రకటించింది. 2020,2021 సంవత్సరాల్లో యూకెకు 40 మిలియన్ల డోసులు సరఫరా చేసేందుకు ఇంతకు ముందే ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం ఫైజర్ వీరికి వ్యాక్సిన్ సరఫరా చేయనుంది. యూకె నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం అక్కడ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించిన డేటాను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ఈ అనుమతులు ఇచ్చినట్లు చెబుతున్నారు. వివిధ వయస్సుల వారిపై ఇది ఎలా పనిచేసిందో కూడా పరిశీలించిన తర్వాతే ఇది సాధ్యం అయిందని చెబుతున్నారు.

Tags:    

Similar News