ఫైజర్..సీరమ్...భారత్ బయోటెక్ కూడా

Update: 2020-12-07 17:23 GMT

ఫార్మా సంస్థలు అన్నీ కరోనా వ్యాక్సిన్ల అత్యవసర అనుమతుల కోసం క్యూకడుతున్నాయి. ఇప్పటికే ఫైజర్, సీరమ్ ఇన్ స్టిట్యూట్ లు అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసుకోగా..ఇప్పుడు భారత్ బయోటెక్ కూడా ఆ జాబితాలో చేరింది. సోమవారం నాడు కంపెనీ తన కోవాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి (ఈయుఏ) కోసం సోమవారం దరఖాస్తు చేసుకుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) తో కలసి భారత్ బయోటెక్ ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది.

దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి వ్యాక్సిన్ ఇదే. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కు చెందిన మూడవ దశ ట్రయల్స్ దేశ వ్యాప్తంగా 26 వేల మందిపై..25 నగరాల్లో నిర్వహిస్తున్నారు. కోవాక్సిన్ డబుల్ డోస్ వ్యాక్సిన్ అన్న విషయం తెలిసిందే. మూడవ దశ ప్రయోగాలు ప్రస్తుతం ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, పంజాబ్, అస్సాంల్లో కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి నాటికి కంపెనీ వ్యాక్సిన్ రెడీ అయ్యే అవకాశం ఉందని సమాచారం.

Tags:    

Similar News