తలసరి ఆదాయంలో భారత్ ను దాటేసిన బంగ్లాదేశ్

Update: 2021-05-21 14:26 GMT

ఒకప్పడు అంటే..2007లో బంగ్లాదేశ్ తలసరి ఆదాయం భారత్ తలసరి ఆదాయంలో సగం మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి?. తాజాగా వెలుగుచూసిన నివేదికల ప్రకారం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తలసరి ఆదాయంలో బంగ్లాదేశ్ ఏకంగా భారత్ ను దాటేసింది. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో బంగ్లాదేశ్ తలసరి ఆదాయం అంతకు ముందు ఏడాది కంటే 9 శాతం పెరుగుదలతో 2227 (1,67,025 రూపాయలు) అమెరికన్ డాలర్లకు పెరిగింది. అదే సమయంలో భారత్ తలసరి ఆదాయం 1947 అమెరికన్ డాలర్లు (1,46,025 రూపాయలు)గా ఉంది.

అయితే కొంత మంది నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది తాత్కాలిక పరిణామమే అంటున్నారు. కరోనా ముందు నుంచి కూడా నిరుద్యోగంతోపాటు పలు అంశాల్లో భారత్ ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటోంది. పెద్ద నోట్ల రద్దుతోపాటు జీఎస్టీ అమలు వంటి అంశాలు దేశ ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించాయని ప్రతిపక్షాలు మోడీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. ఇప్పుడు ఏడాదికిపైగా కోవిడ్ చేస్తున్న విలయం వల్ల కూడా ఆర్ధిక రంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది.

Tags:    

Similar News