బజాజ్ హౌసింగ్ వాటాదారులకు లాభాలే లాభాలు

Update: 2024-09-16 04:35 GMT

ఊహించినట్లే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు దుమ్మురేపాయి. లిస్టింగ్ రోజే ఇన్వెస్టర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. తాజాగా ఐపీఓ కు వచ్చిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఇష్యూ కు పెద్ద ఎత్తున ఆదరణ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కంపెనీ 6500 కోట్ల రూపాయల విలువ గల షేర్లను విక్రయానికి పెట్టగా..దీనికి ఏకంగా 3 .2 లక్షల కోట్ల రూపాయల విలువైన బిడ్స్ వచ్చాయి. ఈ ఇష్యూ కి ఇన్వెస్టర్లలో ఎంత క్రేజ్ ఉందో దీనికి వచ్చిన బిడ్స్ చూసి అర్ధం చేసుకోవచ్చు. మొత్తం మీద బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఇష్యూ 63 .6 రేట్లు ఓవర్ సబ్ స్క్రైబ్ అయింది.

                                        ఆఫర్ ధర 70 రూపాయలు అయితే...ఈ కంపెనీ షేర్లు బిఎస్ఈ లో 153 .80 రూపాయల వద్ద లిస్ట్ కాగా...ఎన్ ఎస్ఈ లో కూడా 150 రూపాయల వద్ద లిస్ట్ అయ్యాయి. గ్రే మార్కెట్ ధర (జీఎంపీ) ఆధారంగా బజాజ్ హౌసింగ్ లిస్టింగ్ 150 రూపాయల వద్ద ఉంటుంది అని అంచనా వేశారు. అలాగే ఈ షేర్లు ఆఫర్ ధర కంటే 120 శాతం లాభంతో 154 రూపాయల వద్ద లిస్ట్ అయ్యాయి. సోమవారం పది గంటల సమయంలో ఈ షేర్లు ఎన్ఎస్ఈ లో గరిష్టంగా 160 రూపాయలకు కూడా చేరాయి. సెకండరీ మార్కెట్ లోనూ ఈ షేర్లకు పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News