షేర్ల కేటాయింపు రేపే....లిస్టింగ్ సెప్టెంబర్ 16 న

Update: 2024-09-11 11:57 GMT

బజాజ్ హోసింగ్ ఫైనాన్స్ ఐపీఓ దుమ్మురేపింది. ఈ ఐపీఓ కి మంచి బజ్ ఏర్పడటంతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున ఈ షేర్స్ కోసం దరఖాస్తు చేశారు. దీంతో పెద్ద ఎత్తున బిడ్స్ వచ్చాయి. బజాజ్ హోసింగ్ ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా మొత్తం 6560 కోట్ల రూపాయలు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ ఇష్యూ లాస్ట్ డేట్ అయిన సెప్టెంబర్ 11 సాయంత్రం నాలుగు గంటలకు ఏకంగా మూడు లక్షల కోట్ల రూపాయల విలువ మేర బిడ్స్ వచ్చాయి. బజాజ్ ఐపీఓ ధరను 66 -70 రూపాయలుగా నిర్ణయించింది. విలువ పరంగా చూసుకుంటే బజాజ్ హోసింగ్ ఐపీఓ టాటా గ్రూప్ కు చెందిన టాటా టెక్నాలజీస్ బిడ్స్ ను అధిగమించింది.

                                              టాటా టెక్నాలజీస్ 3042 కోట్ల రూపాయల సమీకరణకు మార్కెట్ లోకి రాగా...ఈ ఐపీఓకి 1 .56 లక్షల కోట్ల రూపాయల బిడ్స్ వచ్చాయి. బజాజ్ హోసింగ్ ఫైనాన్స్ ఐపీఓ 67 .35 రేట్లు సబ్ స్క్రైబ్ అయినట్లు సమాచారం. తుది లెక్కలు వచ్చేటప్పటికి ఈ లెక్కల్లో కొద్దిగా మార్పులు ఉండే అవకాశం ఉంది. ఈ కంపెనీ షేర్ల కేటాయింపు గురువారం నాడు అంటే సెప్టెంబర్ 12 న పూర్తి అయ్యే అవకాశం అవకాశం ఉంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ లో బజాజ్ హోసింగ్ ఫైనాన్స్ షేర్స్ సోమవారం నాడు అంటే సెప్టెంబర్ 16 న లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. లిస్టింగ్ లో కూడా బజాజ్ హౌసింగ్ షేర్స్ దుమ్ము రేపుతాయని మార్కెట్ వర్గాలు లెక్కలు వేసుకుంటున్నాయి. 

Tags:    

Similar News