బ్రహెయిన్ ప్రధాని ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా కన్నుమూశారు. బుధవారం నాడు ఆయన మృతి చెందినట్లు బహ్రెయిన్ అధికారికంగా ప్రకటించింది. 1971 నుంచి ఆయన ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గల్ఫ్ లో సుదీర్ఘకాలం పరిపాలన సాగించిన వారిలో ఆయన కూడా ఒకరు. అనారోగ్యం కారణంగా ఆయన కొద్ది రోజుల క్రితం అమెరికాలోని మయో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఖలీఫా మృతితో బహ్రెయిన్ ప్రభుత్వం వారం రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది.