ఆటోమొబైల్ రంగంలో భారత్ దూసుకెళుతోంది. ఇప్పుడు ఇండియా ప్రపంచంలో మూడవ అతి పెద్ద ఆటో మార్కెట్ గా అవతరించింది. జపాన్ ను వెనక్కి నెట్టి భారత్ మూడవ ప్లేస్ లోకి దూసుకొచ్చింది. భారత్ లో వాహనాల అమ్మకాలు 42 .5 లక్షల యూనిట్లను దాటాయి. జపాన్ లో ఈ అమ్మకాలు 42 లక్షలు మాత్రమే ఉన్నాయి. నాల్గవ త్రైమాసికానికి సంబంధించి వ్యాణిజ్య వాహనాల లెక్కలు కూడా వస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కరోనా తర్వాత ఇటీవలకాలంలో అమ్మకాలు ఊపందుకున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఆటో మొబైల్ మార్కెట్ లో చైనా ఫస్ట్ ప్లేస్ లో ఉండగా, రెండవ స్థానంలో అమెరికా..ఇప్పుడు మూడవ స్థానంలో ఇండియా నిలిచింది. 2022 లో చిప్ సమస్య కొంత మేర తగ్గటం తో మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ తో పాటు ఇతర సంస్థల అమ్మకాలు కూడా పుంజు కున్నాయి. ఒక బ్రిటిష్ రీసెర్చ్ సంస్థ పరిశోధన ప్రకారం కేవలం దేశ జనాభాలో 8 .5 శాతం మందికి మాత్రమే కార్లు ఉన్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లోనూ దేశ ఆటోమొబైల్ రంగం మరింత దూసుకెళ్లే అవకాశం ఉందని చెపుతున్నారు.