ఎవరికి ఇస్తారో తెలుసా?!

Update: 2025-06-28 06:45 GMT

 ఎలా అయినా అమెరికాలో ఉద్యోగం చేయాలి. డాలర్లు సంపాదించాలి. ఇది ఎంతో మంది ఐటి నిపుణుల కల. ఇందుకు రకరకాల మార్గాలు వెతుకుతుంటారు చాలా మంది. అదృష్టం ఉన్న వాళ్లకు హెచ్ 1 బి వీసా వస్తుంది. వాళ్ళు ఎంచక్కా అమెరికా వెళ్లి అక్కడ ఉద్యోగం చేసుకుంటారు. అయితే ఈ ఛాన్స్ అందరికి దక్కదు. ఎందుకంటే లాటరి లో ఇది పిక్ కావాలి అంటే అదృష్టం కూడా ఉండాలి. కీలక కంపెనీల్లో పని చేసే నిపుణులు కూడా సంవత్సరాల తరబడి హెచ్ 1 బి వీసా కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తూ ఉంటారు. చాలా మంది కి అమెరికా లో ఉద్యోగం చేయటం...అమెరికా ని సందర్శించి రావటం వంటివి పెద్ద కలగా ఉంటాయి. ఇందులో అత్యంత కీలక అంశం వీసా సాధించటమే. డబ్బులున్న వాళ్ళు అయినా కూడా రకరకాల కారణాలతో కొంత మందికి వీసా లు రిజెక్ట్ అవుతూ ఉంటాయి. ఈ సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్ రెండవ సారి అమెరికా అధ్యక్షుడు అయినా తర్వాత రకరకాల ఆంక్షలు తెర మీదకు తెస్తున్నారు.

                                                                              మరో వైపు కొద్ది రోజుల క్రితమే ఆయన గోల్డ్ కార్డు ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఐదు మిలియన్ అమెరికన్ డాలర్స్ చెల్లిస్తే నేరుగా అమెరికా పౌరసత్వంతో కూడిన ఈ కార్డు జారీ చేస్తారు. ఐదు మిలియన్ డాలర్స్ అంటే మన భారతీయ కరెన్సీలో 42 కోట్ల రూపాయలపైమాటే. ఇంత మొత్తం చెల్లించి అమెరికా పౌరసత్వం పొందాలి అంటే సంపన్నులకు మాత్రమే సాధ్యం అయ్యే విషయం అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అమెరికా వీసా లు పొందటానికి మరో కొత్త మార్గం వచ్చింది. ఇది ఇప్పుడే కొత్త్తగా వచ్చింది కాకపోయినా కూడా ఈ మధ్య కాలంలో దీని డిమాండ్ గణనీయంగా పెరుగుతున్నట్లు కన్సల్టెంట్స్ చెపుతున్నారు. అదే ఓ 1 వీసా .

                                                     అయితే ఇవి ఎవరికి పడితే వాళ్లకు ఇచ్చేవి కావు. వివిధ రంగాల్లో అసాధారణ నైపుణ్యం వాళ్లకు మాత్రం ఈ కేటగిరీ లో వీసా జారీ చేస్తారు. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, వ్యాపారం, విద్య వంటి విభాగాల్లో మంచి నైపుణ్యం ఉంటే అలాంటి వాళ్లకు ఈ ఓ 1 వీసా ఇస్తారు. కాకపోతే హెచ్ 1 బి వీసాలతో పోలిస్తే ఈ వీసా ఫీజు చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇందుకు కూడా పలు మార్గదర్శకాలు పాటించాల్సి ఉంటుంది. ఈ విభాగంలో వీసా పొందాలంటే ఎనిమిది కేటగిరీల్లో కనీసం మూడు అయినా దరఖాస్తుదారు అర్హత సాధించి ఉండాలి. ఇందులో మీడియా కవరేజ్ తో పాటు సాధించిన అవార్డులు, పబ్లికేషన్స్ వంటివి ఉన్నాయి. అయితే ఈ వీసా కోసం ఫీజు కింద పది వేల నుంచి ఏకంగా 30 వేల డాలర్స్ వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు సిద్ధపడిన వాళ్లకు..అర్హత ఉంటే చాలు. వీసా ఇచ్చేస్తారు..ఎందుకంటే ఈ వీసా ల విషయంలో ఎలాంటి పరిమితి లేదు. ఇతర వీసాల జారీలో కఠిన నిబంధనలు అమలు చేస్తుండంతో కొంత మంది ఐటి నిపుణులు...పరిశోధకులు, సైబర్ ఎక్స్ పర్ట్స్ ఈ రూట్ లో వీసా లు సాధించే ప్రయత్నం చేస్తున్నట్లు చెపుతున్నారు. 

Tags:    

Similar News