Full Viewయూత్ కు...సంపన్నులకు ఆపిల్ ఉత్పత్తులు అంటే ఎంతో క్రేజ్. అందుకే ఎంత ఖరీదు అయినా వీటినే కొంటారు. ఇది వాళ్లకు ఒక స్టేటస్ సింబల్ కూడా. ఆపిల్ మ్యాక్ బుక్ పర్సనల్ కంప్యూటింగ్ ను పరిచయం చేయగా, ఆపిల్ ఐఫోన్ మొబైల్ కంప్యూటింగ్ ను పరిచయం చేసిందని, ఇప్పుడు ఆపిల్ విజన్ ప్రో వినియోగదారులకు స్పేషియల్ కంప్యూటింగ్ ను పరిచయం చేస్తుందని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ వెల్లడించారు. ఆపిల్ విజన్ ప్రో అనేది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అని, ఇది తమ వినియోగదారులను ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు ఉత్తేజాన్ని అందిస్తుందని అన్నారు. తాజాగా జరిగిన ఆపిల్ వార్షిక ఈవెంట్ లో దీన్ని ప్రదర్శించి చూపారు. ఇప్పుడు ఇది పెద్ద సంచలనంగా మారింది. అంతే కాదు..ప్రతి ఒక్కరు అసలు ఏంటి ఈ ఆపిల్ విజన్ ప్రో అంటూ తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి వీటి అమ్మకాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. దీని ధర 3500 డాలర్స్. మన భారతీయ కరెన్సీ లో అయితే 2 .90 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. హెడ్ సెట్ పెట్టుకున్న తర్వాత ఎలాంటి అదనపు యాక్సిసరీస్ దీనిని ఆపరేట్ చేయటవానికి అవసరం కూడా ఉండదు. చేతులను కదిలించటం ద్వారా ఆపరేట్ చేయటమే. ఈ హెడ్ సెట్ లో కంటిని ట్రాక్ చేసే సిస్టం ఉంటుంది. మన కళ్ళు ఎటు వైపు వెళితే వాటిని హెడ్ సెట్ హై లైట్ చేస్తుంది. ఒక ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుని తర్వాత చేతివేళ్లతోనే మొత్తం ఆపరేట్ చేయవచ్చు. హెడ్ సెట్ బయట ఉండే సెన్సార్స్ ఆధారంగా ఇది పని చేస్తుంది. ఆపిల్ కి చెందిన మొదటి స్పేషియల్ కంప్యూటర్ గా పిలవబడే ఈ హెడ్ సెట్, డిజిటల్ కంటెంట్ ను ఫీజికల్ వరల్డ్ తో మిక్స్ చేయడంతో పాటు ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది.
ఆపిల్ విజన్ ప్రో తో వినియోగదారులకు లెక్కలేనన్ని ఆప్షన్స్ ఉండబోతున్నాయి. దీనిని ఉపయోగించి వినియోగదారులు గేమ్స్ ఆడడం, సినిమాలు చూడడం, వీడియో కాల్స్ మాట్లాడడం , ఫోటో లు తీయటం వంటి ఎన్నో పనులు చేయవచ్చు.వీటితో పాటు వినియోగదారులు ఈ హెడ్ సెట్ ను ధరించి మ్యూజిక్ వినడం, మెయిల్స్, మెస్సేజెస్ వంటి ఎక్కువగా వినియోగించే యాప్స్ ను యాక్సిస్ చేయవచ్చునని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. విజన్ ప్రో అనేది దశాబ్దాల ఆపిల్ ఇన్నోవేషన్ లో భాగమని, ఇది అనేక రకాల అద్భుతమైన ఆవిష్కరణలతో వస్తుందని సీఈఓ తెలిపారు. దీనిని వినియోగించే సమయంలో వినియోగదారులు ఒక కొత్త అనుభూతికి లోనవుతారని, ఇది ప్రతి ఒక్క వినియోగదారుడిని ఎంతగానో ఆకర్షిస్తుందని కుక్ తెలిపారు. ఆపిల్ విజిన్ ప్రో హెడ్ సెట్ పై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా కూడా తనదైన స్టైల్ లో స్పందించారు. ఆపిల్ కొత్తగా తీసుకొచ్చిన ఈ ప్రోడక్ట్ తో పెద్ద స్క్రీన్ టీవీ ల కు మరణశాసనంగా మారబోతుందా అని అయన సందేహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలపై సోనీ,శాంసంగ్ బోర్డు రూమ్స్ లో ఎలాంటి చర్చ జరుగుతుందో అని ట్వీట్ చేశారు. ఆపిల్ విజన్ ప్రో తో తోటి ఇక అందరు కలిసి కూర్చుని సినిమాలు, స్పోర్ట్స్ చూసే అవకాశం పోతుంది అని..ఇక రూమ్ ల నిండా హెడ్ సెట్స్ ధరించిన జాంబీలే ఉంటాయని కామెంట్ చేశారు.