వరల్డ్ టాప్ టెన్ బ్రాండ్స్ ఇవే

Update: 2024-01-18 16:09 GMT

ప్రపంచంలోని అత్యంత విలువైన బ్రాండ్స్ జాబితాలో అమెరికా కంపెనీలే టాప్ లో ఉన్నాయి. బ్రాండ్ ఫైనాన్స్ 2024 సంవత్సరానికి సంబంధించి ప్రపంచంలోని అగ్రశ్రేణి ఐదు వందల కంపెనీల జాబితా సిద్ధం చేసింది. దీని ప్రకారం యాపిల్ నెంబర్ వన్ ప్లేస్ ను దక్కించుకుంది. యాపిల్ తన బ్రాండ్ వేల్యూ ను గణనీయంగా పెంచుకోగలిగింది. యాపిల్ బ్రాండ్ వేల్యూ రెండు వందల పందొమ్మిది బిలియన్ డాలర్లు పెరిగి...517 బిలియన్ డాలర్లకు చేరింది. యాపిల్ తర్వాత అత్యధిక బ్రాండ్ వేల్యూ ఉన్న కంపెనీ గా రెండవ స్థానంలో మైక్రో సాఫ్ట్ నిలిచింది. ఈ కంపెనీ బ్రాండ్ విలువ మూడు వందల నలభై బిలియన్ డాలర్లు గా ఉంది. ఆ తర్వాత వరసగా గూగుల్, అమెజాన్, సామ్ సంగ్, వాల్ మార్ట్, టిక్ టాక్, పేస్ బుక్, డ్యుయిష్ టెలికాం, ఐసిబిసి లు ఉన్నాయి.

                                 ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా కంపెనీ ఈ జాబితాలో పద్దెనిమిదవ స్థానంలో ఉంటే..ఇంస్టాగ్రామ్ పదమూడవ ప్లేస్ లో ఉంది. ఇక ఐటి సర్వీస్ ల కంపెనీల విషయానికి వస్తే ప్రపంచంలోని టాప్ టెన్ జాబితాలో పలు భారతీయ కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. ఇందులో టాప్ టెన్ కంపెనీలు చూస్తే మొదటి స్థానంలో యాక్సెంక్చర్ ఉంటే..రెండవ స్థానంలో టిసిఎస్, మూడవ ప్లేస్ ఇన్ఫోసిస్, ఆ తర్వాత వరసగా ఐబిఎం, కేప్ జెమినీ, ఎన్ టిటి డేటా, కాగ్నిజెంట్, హెచ్ సిఎల్ టెక్, విప్రో, ఫుజిట్సు లు ఉన్నాయి. యాక్సెంక్చర్ బ్రాండ్ వేల్యూ నలభై బిలియన్ డాలర్లుగా ఉంది.

Tags:    

Similar News