రిల‌య‌న్స్ జియోకు కొత్త ఛైర్మ‌న్..ఆకాష్ అంబానీ

Update: 2022-06-28 12:25 GMT

ముఖేష్ అంబానీ ఔట్. ఆకాష్ అంబానీ ఇన్. రిల‌య‌న్స్ జియోలో కీల‌క మార్పులు జ‌రిగాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ విభాగం రిలయన్స్‌ జియో డైరెక్టర్‌ పదవికి ముఖేష్ అంబానీ రాజీనామా చేశారు. ఆయన కుమారుడు ఆకాష్ అంబానీ నూత‌న ఛైర్మన్‌గా నియమితులయ్యారు. జియో​ డైరెక్టర్ పదవి నుంచి ముఖేశ్‌ అంబానీ వైదొలగినట్టు జియో మంగళవారం తెలిపింది. నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్,ముఖేశ్‌ కుమారుడు ఆకాష్ అంబానీని కొత్త బోర్డు ఛైర్మన్‌గా సంస్థ ప్రకటించింది.

కంపెనీ డైరెక్టర్ పదవికి ముఖేశ్ అంబానీ రాజీనామా చేయడంతో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పంకజ్ మోహన్ పవార్ బాధ్యతలు స్వీకరించారని వెల్లడించింది. సోమవారం నాడు జరిగిన జియో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈ విష‌యాన్ని రిల‌య‌న్స్ సంస్థ స్టాక్ ఎక్స్చేంజ్ ల‌కు ఇచ్చిన స‌మాచారంలో తెలిపింది. అయితే ముకేష్ అంబానీ రిల‌య‌న్స్ జియో ఫ్లాట్ పాం ఛైర్మ‌న్ గా మాత్రం కొన‌సాగ‌నున్నారు. 

Tags:    

Similar News