'ఆకాశ ఎయిర్ లైన్స్' తొలి విమానం వ‌చ్చేసింది

Update: 2022-06-21 14:53 GMT

ప్ర‌ముఖ ఇన్వెస్ట‌ర్ రాకేష్ ఝున్ ఝున్ వాలా కు చెందిన ఆకాశ ఎయిర్ లైన్స్ కు సంబంధించి తొలి విమానం మంగ‌ళ‌వారం నాడు ఢిల్లీలో ల్యాండ్ అయింది. ఈ విష‌యాన్ని కంపెనీ అధికారికంగా వెల్ల‌డించింది. ఆకాశ ఎయిర్ లైన్స్ మొత్తం 72 బోయింగ్ 737 మాక్స్ విమానాల‌కు ఆర్డ‌ర్ ఇవ్వ‌గా తొలి విమానం ఢిల్లీలో దిగింది. ఈ చిత్రాన్ని కంపెనీ సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ క్యూపీ ఇంటికొచ్చేసింది అంటూ రాసుకొచ్చింది.

తొలి విమానం రావటంతో ఆకాశ ఎయిర్ లైన్స్ ఇక ఎయిర్ ఆప‌రేట‌ర్ ప‌ర్మిట్ (ఏవోపీ) పొందేందుకు మార్గం సుగ‌మం అయింది. జులై నుంచి ఈ విమాన స‌ర్వీసులు ప్రారంభం అయ్యే అవ‌కాశం ఉంది. ఆకాశ ఎయిర్ పూర్తిగా ఆధార‌ప‌డ ద‌గ్గ‌..పూర్తిగా అందుబాటు ద‌ర‌ల్లో ఉండే ఎయిర్ లైన్ గా నిలుస్తుంద‌ని సంస్థ సీఈవో అండ్ మేనేజింగ్ డైర‌క్ట‌ర్ విన‌య్ దూబే ట్వీట్ చేశారు. ఇప్ప‌టికే అన్ని అనుమ‌తులు పొందిన ఆకాశ ఎయిర్ లైన్స్ ఇక స‌ర్వీసులు ప్రారంభించ‌ట‌మే ఆల‌శ్యం.

Tags:    

Similar News