వాహనదారులకు ఇప్పటికే చుక్కలు చూపిస్తున్న ఇంధన ధరలు మరింత పెరగనున్నాయి. ప్రతిపక్షంలో ఉండగా పెట్రోల్, డీజిల్ ధరల అంశంపై విమర్శలు చేసిన బిజెపి..అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ కంటే దారుణంగా వ్యవహరిస్తోంది. అంతర్జాతీయ క్రూడ్ ధరల ప్రకారం ఉండాల్సిన ధరలను ఎప్పటికప్పుడు పన్నులు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తోంది. తాజాగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి ప్రవేశపెట్టిన 2021-22 బడ్జెట్ లో మరోసారి పెట్రో మంట మరింత పెరిగేలా నిర్ణయం తీసుకున్నారు.
పెట్రోల్ పై 2.50 రూపాయలు, డీజిల్ పై 4 రూపాయలు అగ్రి ఇన్ ఫ్రా సెస్ విధించనున్నట్లు తెలిపారు. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగబోతున్నాయి. మద్యం ఉత్పత్తులపై 100 శాతం, ముడి పామాయిల్ పై 17.5 శాతం, సోయాబీన్, పొద్దు తిరుగుడు ముడి నూనెపై 20 శాతం, యాపిల్ పై 35 శాతం, బంగారం, వెండిపై 2.5 శాతం చొప్పున అగ్రిసెస్ విధిస్తున్నారు. దీంతో ఆయా ఉత్పత్తుల ధరలు పెరగటం అనివార్యం కానుంది.