అదానీ విల్మ‌ర్ షేర్ల దూకుడు

Update: 2022-02-09 12:44 GMT

తాజాగా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన అదానీ విల్మ‌ర్ షేర్లు దూకుడు మీద ఉన్నాయి. బుధ‌వారం నాడు ఈ కంపెనీ షేర్లు బీఎస్ఈ, ఎన్ ఎస్ఈ ల్లో లిస్ట్ అయిన విష‌యం తెలిసిందే. తొలుత ఆఫ‌ర్ ద‌ర అయిన 230 రూపాయ‌ల కంటే త‌క్కువ‌గా 221 రూపాయ‌ల వ‌ద్ద న‌మోదు అయ్యాయి. కొద్దిసేప‌టికే లాభాల ప‌ట్టాయి. అయితే మ‌రుస‌టి రోజు అంటే బుధ‌వారం నాడు ఈ కంపెనీ షేర్లు ఏకంగా 20 శాతం అప్ప‌ర్ స‌ర్క్యూట్ తో బీఎస్ ఈలో 318 రూపాయ‌ల వ‌ద్ద ముగిసింది. అదే ఎన్ ఎస్ ఈలో మాత్రం 321 రూపాయ‌ల వ‌ద్ద క్లోజ్ అయింది.

ఈ కంపెనీ ఐపీవోకు వ‌చ్చి మార్కెట్ నుంచి 3600 కోట్ల రూపాయ‌లు స‌మీక‌రించిన విష‌యం తెలిసిందే. ఫార్చ్యూన్ పేరుతో వంట‌నూనెల‌తోపాటు ఇత‌ర ఆహార ఉత్ప‌త్తుల‌ను విక్ర‌యించే ఈ కంపెనీని అదానీ గ్రూపు తోపాటు సింగ‌పూర్ కు చెందిన విల్మ‌ర్ లు సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. బుధ‌వారం నాడు బీఎస్ఈ సెన్సెక్స్ 657 పాయింట్ల లాభంతో ముగిసింది. ప్రారంభం నుంచి కొనుగోళ్ళ మ‌ద్ద‌తు ల‌భించ‌టంతో షేర్లు లాభాల బాట ప‌ట్టాయి.

Tags:    

Similar News