ఇప్పుడు ఇది బెంగుళూరు నుంచి అందుబాటులోకి రానుంది. ముంబయ్ తర్వాత ఈ విలాస విహంగం సేవలు పొందనున్న రెండవ నగరంగా బెంగుళూరు నిలవనుంది. కర్ణాటక రాజధాని నగరం అయిన బెంగుళూరు నుంచి దుబాయ్ కు ఎమిరేట్స్ ప్రతి రోజూ ఈ సర్వీసులను నడపనుంది. బెంగుళూరు నుంచి ఈ అతి పెద్ద విమాన సర్వీసును ప్రారంభిస్తున్న తొలి ఎయిర్ లైన్ తమదే అని ఎమిరేట్స్ తెలిపింది. ఈ విమానంలో ప్రైవేట్ సూట్ లతోపాటు స్పా, ఓపెన్ లాంజ్ బార్ వంటి సౌకర్యాలు కూడా ఉంటాయి. మరి హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ సర్వీసులు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో వేచిచూడాల్సిందే.