సాల్ట్ బే రెస్టారెంట్ ..పద్నాలుగు మందికి 1. 36 కోట్ల బిల్

Update: 2022-11-21 13:58 GMT

స్టార్ హోటల్ బిల్స్ అంటే అలాగే ఉంటాయి. అయితే కొన్నిసార్లు అరటిపండుకి అడ్డగోలు రేట్లు వేసి బుక్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే స్పెషాలిటీ రెస్టారెంట్స్ లో ఉండే ఫుడ్ బిల్స్ పై ఎవరూ పెద్దగా ఫిర్యాదు చేయలేరు. ఎందుకు అంటే వాటి స్పెషాలిటీ అది కాబట్టి. అదే సమయంలో అక్కడి రేట్స్ చెల్లించటానికి సిద్ద పడ్డ వాళ్ళే అక్కడకు వెళతారు కాబట్టి. నవంబర్ 17 న అబూ దాబి లోని సాల్ట్  బే రెస్టారెంట్ ఒక పద్నాలుగు మంది కి వేసిన బిల్ ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. ఎందుకు అంటే వీరంతా కలిసి అక్కడ వైన్, ఇతర వెరైటీ ఫుడ్ కోసం చెల్లించిన మొత్తం ఏకంగా 1.36 కోట్ల రూపాయలు ఉండటమే దీనికి కారణం.వీళ్ళు అక్కడి కరెన్సీ లో 615065 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్ (ఏఈడి) లు చెల్లించారు. అదే మన కరెన్సీలో 1.36 కోట్ల రూపాయలు.

                            అంతర్జాతీయంగా ప్రముఖ చెఫ్ గా ఉన్న నుస్రత్ గోక్సే కు చెందిన రెస్టారెంట్ లో ఈ ఘటన చోటుచేసుకొంది. ఈ బిల్ ను అయన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్ జోడించారు. అదేంటి అంటే నాణ్యత ఎప్పుడు ఖరీదైనది కాదు అంటూ ఈ బిల్ ను షేర్ చేశారు. ఎన్ని స్పెషాలిటీ ఫుడ్స్ ఉన్నా మరి ఇంత బిల్లా అన్న చర్చ నడుస్తోంది. ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే తిన్న వాళ్ళు..బిల్ కట్టిన వారు అంతే బాగానే ఉన్నారు. కానీ దీనిపై సోషల్ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ నడుస్తోంది. అదేంటి అంటే మీరు ఫుడ్ ఐటమ్స్ ఏమైనా బంగారం తో చేస్తారా లేక..అంతరిక్షం నుంచి తెస్తున్నారా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే వీటిని వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే కొన్ని నాన్ వెజ్ వంటకాలకు 24 క్యారెట్ గోల్డ్ కోటింగ్ వాడినట్లు తెలిపారు.

Tags:    

Similar News