పోలవరంలో జగన్ సర్కారును 'ఫిక్స్' చేసిన సాక్షి

Update: 2020-10-26 14:39 GMT

కేంద్రాన్ని మెప్పించి..ఒప్పించి..!

పోలవరం పనులను ప్రక్షాళన చేసిన ముఖ్యమంత్రి జగన్

మరి ప్రక్షాళన చేస్తే ఈ లెక్క తేడా ఎందుకు వచ్చిందో?

మరి ఇదేంది?. సాక్ష్యాత్తూ సాక్షి పేపర్ లో గత నెల 23న ఈ వార్త ప్రముఖంగా వచ్చింది. అందులో సారాంశం ఏమిటంటే పోలవరం పనులను ముఖ్యమంత్రి జగన్ ప్రక్షాళన చేశారు. ప్రభుత్వ చిత్తశుద్ధి తో ఆర్ ఈసీ నివేదికలతో కేంద్రం వైఖరి మారిపోయిందని తేల్చారు. సవరించిన అంచనాలకు ఇక ఆమోదమే తరువాయి అన్నారు. సవరించిన అంచనా వ్యయం 47,725 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. అందులో చంద్రబాబు కమిషన్ల దాహన్ని ఆర్ ఈసీ బహిర్గతం చేసిందని పేర్కొన్నారు. దీంట్లో అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. చంద్రబాబు లేఖలు కూడా నిజమే. మరి జగన్ చేసిన ప్రక్షాళన ఎటుపోయింది. ఒప్పించి..మెప్పించిన సీన్ ఎటు పోయింది.

పోలవరంపై ఎందుకు ఆకస్మాత్తుగా కేంద్రం వైఖరి మారిపోయింది. తప్పు కేంద్రానిదా?. జగన్ సర్కారు దా?. విభజన చట్టంలోని సెక్షన్ 90(4) ప్రకారం పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని ఎంత ఖర్చు అయితే అంతా కేంద్రమే భరించాలని జగన్మోహన్ రెడ్డి సర్కారు స్పష్టం చేయటంతో కేంద్రం ఓకే చేసిందని అన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ పోరాటం చేయకపోయి ఉంటే చంద్రబాబు సర్కారు నిర్వాకం వల్ల రాష్ట్ర ఖజానాపై 38 వేల కోట్ల రూపాయల భారం పడేందని ఈ వార్తలో రాశారు. మరి అంతలోనే ఇంత మార్పు ఎలా వచ్చింది?. అన్నది సర్కారు పెద్దలకే తెలియాలి.

Tags:    

Similar News