కాంగ్రెస్ నేతల్లో కూడా ఇదే చర్చ
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన దానికి భిన్నంగా చర్యలు!
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పింది ఒకటి. అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నది మరొకటి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కాళేశ్వరం ప్రాజెక్ట్ రెడీ మేడ్ ఏటీఎం గా మారింది అనే చర్చ కాంగ్రెస్ నేతల్లోనే సాగుతోంది. స్కాం ల నుంచే స్కాం లు చేయటం ఇప్పుడు కొత్త కాన్సెప్ట్. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది పెద్ద ఎత్తున అమలు అవుతోంది అనే ఆరోణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వాలు చేసిన స్కాం లపై విచారణ జరిపి చర్యలు తీసుకోవటం...అక్రమంగా సంపాదించిన డబ్బును రికవరీ చేయటం కంటే కూడా పాత స్కాం ల నుంచే కొత్తగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు తమ వంతు వాటాలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది అని పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో ప్రచారంలో ఉంది. బిఆర్ఎస్ హయాంలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆ పార్టీకి ఏటీఎంగా మారింది అని..కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తో పాటు ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉండగా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పుకొచ్చింది. ప్రస్తుత నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి లు కూడా అధికారంలోకి వచ్చిన కొత్తలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఈ ప్రాజెక్ట్ స్కాం విషయంలో మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు.
రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ పై జస్టిస్ పీసి ఘోష్ నేతృత్వంలో కమిషన్ వేసినా కూడా అందులో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంచనాల పెంపు...అవినీతి విషయాన్ని పూర్తిగా విస్మరించారు. కేవలం ఈ కమిషన్ కు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో జరిగిన అక్రమాలు..అవీనీతి, డిజైన్ల లోపాలు వంటి వాటిపైనే ఫోకస్ పెట్టేలా టర్మ్స్ అఫ్ రిఫరెన్స్ ఇచ్చారు అని అధికార వర్గాలు చెపుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అతి పెద్ద కాంపోనెంట్ అయిన మోటార్లు..పుంపుల విషయంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాల విషయాన్ని రేవంత్ రెడ్డి సర్కారు పూర్తిగా విస్మరించింది. దీనికి ప్రధాన కారణం ఇందులో భాగస్వాములు ఉన్న కాంట్రాక్టర్లను కాపాడటంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కూడా దీన్ని ఒక రె
అంటే లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం కట్టిన ప్రాజెక్ట్ నిండా ఐదేళ్లు పూర్తి కాకుండానే భారీ లోపాలు బయటపడితే అందుకు బాద్యులైన వారు ఎవరో తేల్చకుండానే....అవినీతి పరులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాజెక్ట్ పై వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయటానికి సిద్ధం అవుతోంది. అయితే ఇది వందల కోట్ల రూపాయలతో ఆగిపోతుందా...వేల కోట్ల రూపాయల వరకు వెళుతుందా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు. భారీ మొత్తంలో ప్రజాధనం ఖర్చుపెట్టిన నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ఉపయోగంలోకి తీసుకురావద్దు అని ఎవరూ చెప్పరు. కానీ కనీసం ఇందులో అవినీతికి...అక్రమాలకు కారణం ఎవరూ అనే విషయం తేల్చకుండా...అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా కూడా ఎవరిపై అయితే గతంలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తీవ్రమైన విమర్శలు చేశారో...వాళ్ళను పూర్తిగా కాపాడుతున్న తీరు సొంత పార్టీ నేతలను కూడా విస్మయానికి గురి చేస్తోంది.