సీనియర్ నేత, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి అధికార టీఆర్ఎస్ లో చేరనున్నారు. దీనికి ఈ నెల30ని ముహుర్తంగా నిర్ణయించారు. ముఖ్యమంత్రి కెసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు. కొద్ది రోజుల క్రితమే ఆయన బిజెపికి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.
ఈటెల రాజేందర్ బిజెపిలో చేరినప్పటి నుంచి ఆయన పార్టీతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. చివరకు బిజెపికి గుడ్ బై చెప్పి కారెక్కాలని నిర్ణయం తీసుకున్నారు. హుజూరాబాద్ బరిలో టీఆర్ఎస్ పెద్దిరెడ్డిని నిలబెట్టే చాన్స్ ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.