ఎల్ఆర్ఎస్..బిఆర్ఎస్ పై అప్పటివరకూ ముందుకెళ్ళొద్దు

Update: 2021-01-20 09:34 GMT

తెలంగాణ హైకోర్టు బుధవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ లపై ముందుకెళ్లొద్దని ఆదేశించింది. సుప్రీంకోర్టులో కేసు తేలిన తర్వాత హైకోర్టులో విచారణ జరుపుతామని..అప్పటి వరకూ దరఖాస్తుదారులను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన అర్డర్‌ కాఫీలను సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్‌లపై ఇప్పటికే మూడు రాష్ట్రాలను ఇంప్లీడ్‌ చేసిన సుప్రీంకోర్టు..ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్‌లపై విధివిధానాలు తెలపాలని మూడు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం. అప్పటి వరకు బీఆర్ఎస్ పై స్టే యధావిధిగా కొనసాగుతుందని తెలిపింది. ఎల్ఆర్ఎస్ మీద ప్రభుత్వం తెచ్చిన జీవో పై ఎలాంటి చర్యలు తీసుకోమని కోర్టుకు తెలిపిన ఏజీ.. ఏజీ చెప్పిన స్టేట్మెంట్ ను నమోదు చేసుకున్న హైకోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.

Tags:    

Similar News