ఎమ్మెల్యే మంచిరెడ్డి కాన్వాయ్ పై చెప్పులు

Update: 2020-10-15 07:16 GMT

అధికార పార్టీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి గురువారం నాడు చేదు అనుభవం ఎదురైంది. ఫార్మా సిటీ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న రైతులు ఆయన కాన్వాయ్ పై చెప్పులు విసిరారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తమ గ్రామంలోకి రావటానికి వీల్లేదని వీరు ఆందోళనకు దిగారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో జరిగింది. ఎమ్మెల్యే కారణంగానే తమ గ్రామం ఫార్మాసిటీ పరిధిలోకి వెళుతుందని రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

పోలీసులు ఆందోళన చేస్తున్న రైతులపై లాఠీచార్జీ చేశారు. దీంతో కొంత మందికి గాయాలు కూడా అయ్యాయి. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆ గ్రామ ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమను బెదిరింపులకు గురిచేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మేడిపల్లిలో పంట పరిశీలనకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, రైతుల మధ్య తోపులాట కూడా జరిగింది.

Tags:    

Similar News