అక్కడ నుంచే వీళ్ళ లవ్ ట్రాక్ స్టార్ట్ అవుతుంది. విజయ్ తండ్రి సచిన్ ఖేడ్కర్ పూర్తిగా సైన్స్ ను తప్ప...సంప్రదాయాలను, ఆచారాలను ఏ మాత్రం పట్టించుకోని నాస్తికుడు. హీరోయిన్ సమంత తండ్రి మురళి శర్మ. ఆయన ప్రముఖ ప్రవచనాకారుడు... సైన్స్ కంటే సంప్రదాయాలు, ఆచారాలు ఎంతో ముఖ్యం అని నమ్మే వ్యక్తి. మరి పూర్తి భిన్న దృవాలు అయిన ఫ్యామిలీల నుంచి వచ్చిన వీళ్లిద్దరి పెళ్లి ఎలా జరిగింది...అందులో ఎదురైన ఇబ్బందులు ఏమిటి అన్నదే ఈ సినిమా. తెలుగు ప్రేక్షకులు ఈ తరహా సినిమాలను ఇప్పటికే ఎన్నో చూసి ఉన్నారు. కథలో ఏ మాత్రం కొత్తదనం లేకుండా..దర్శకుడు శివ నిర్వాణ ప్రేక్షకులపై ప్రయోగం చేశారనే చెప్పాలి. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కావటంతో ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ లో కాశ్మీర్ అందాలను అద్భుతంగా చూపించారు. పాటలు బాగున్నాయి. విజయ దేవరకొండ, సమంతలు తమ తమ పాత్రల్లో మంచి నటన చూపించినా కథలో కొత్తదనం కొరవడటంతో ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యే సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. ఎన్నో ఆశలు పెట్టుకున్నా విజయ్, సమంతల కు ఖుషి నిరాశనే మిగిల్చే అవకాశం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే పేరులో ఖుషి తప్ప సినిమాలో అది ఎక్కడా కనిపించదు.
రేటింగ్ :2 .25 /5