సంక్రాంతి సీజన్ ఫస్ట్ మూవీ

Update: 2026-01-09 07:37 GMT

సంక్రాంతి పండగ సీజన్ లో ఫస్ట్ మూవీ గా రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా హీరో ప్రభాస్ గత కొన్ని సంవత్సరాలుగా తన టైటిల్ లో ఉన్న రెబల్ స్టార్ కు తగ్గట్లే యాక్షన్ సినిమాలు చేస్తూ ఒక న్యూ ఇమేజ్ సొంతం చేస్తుకున్నాడు. ఇప్పుడు సడన్ గా మారుతీ దర్శకత్వంలో జోనర్ మార్చి రాజాసాబ్ సినిమాకు ఓకే చేయటం ద్వారా ఫ్యాన్స్ తో పాటు అందరిని సర్ప్రైజ్ చేశాడు . రాజాసాబ్ సినిమా శుక్రవారం నాడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు పలు సందర్భాల్లో దర్శకుడు మారుతీ చేసిన ప్రకటనలు సినిమాపై అంచనాలను పెంచాయి. చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ ఈ సినిమాలో వింటేజ్ లుక్ లో కనిపిస్తుండటంతో దీనిపై ఫ్యాన్స్ కూడా భారీ ఆశలే పెట్టుకున్నారు. ఈ సినిమా కథ అంతా కూడా నాయనమ్మకు ఇచ్చిన మాట ప్రకారం తప్పిపోయిన తాతయ్యను వెతకటానికి బయలుదేరతాడు రాజాసాబ్. రాజాసాబ్ నాయనమ్మకు అన్నీ మర్చిపోయే అలవాటు ఉన్నా కూడా భర్త విషయాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోదు. తాంత్రిక విద్యలతో పెద్ద ఎత్తున బంగారం, ఆస్థి సంపాదించి పునర్జన్మ కోసం ప్రయత్నిస్తున్న తన తాతను రాజాసాబ్ ఎలా అడ్డుకుంటాడు.

                                        ఒక దశ లో తన విద్యలతో తన భార్య ను, మనవడిని కూడా చంపాలని చూసిన కనకరాజు నుంచి రాజాసాబ్ ఎలా బయటపడ్డాడు అన్నదే ఈ మూవీ. ఇందులో రాజాసాబ్ నాయనమ్మగా జరీనా వహాబ్ నటిస్తే... తాత గా...మార్మిక విద్యలు తెలిసిన తాంత్రికుడి పాత్రలో సంజయ్ దత్ నటించారు. సినిమా ఎక్కువ భాగం వీళ్ళ ముగ్గురు చుట్టూనే తిరుగుతుంది. ప్రభాస్ చాలా సంవత్సరాల తర్వాత కొత్త జోనర్ లో సినిమా చేసి..ఇందులో ఆయన ముఖ్యంగా తన ఫ్యాన్స్ ఎలా కోరుకున్నారో అలా కనిపించాడు అనే చెప్పాలి. ప్రభాస్ లుక్స్ పరంగా...యాక్షన్స్ తో నూ ఆకట్టుకున్నాడు. ఇందులో ప్రేక్షకులకు పాత ప్రభాస్ కనిపించాడు. ప్రభాస్ న్యూ లుక్ లో కనిపిస్తుండటం...ఇందులో ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ ఉండటంతో సినిమా ఎలా ఉండబోతుందా అన్న జోష్ ఎక్కువ మందిలో ఏర్పడింది. అయితే ఈ జోష్ ని నిలపటంలో దర్శకుడు మారుతి సక్సెస్ కాలేదు అనే చెప్పొచ్చు. కథలో ఒకింత కొత్తదనం ఉన్నా కూడా ఫస్ట్ హాఫ్ మూవీ మరీ స్లో గా సాగుతుంది. సెకండ్ హాఫ్ నుంచి కాస్త జోరు పెరుగుతుంది అనే చెప్పాలి. సినిమాలో హై లైట్ అంటే క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలే.

                                                 ఇప్పటికే పాటలు అన్నీ ప్రేక్షకులు వినీ వినీ ఉండటంతో ఇవి సినిమాలో కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. హీరోయిన్స్ ముగ్గురిలో ఎక్కువ స్క్రీన్ స్పేస్ దక్కింది అంటే మాళవిక మోహనన్ కే అని చెప్పాలి. ఆ తర్వాత నిధి అగర్వాల్ ఉంటుంది. రిద్దీ కుమార్ పాత్రకు ఏ మాత్రం ప్రాధాన్యత ఉండదు. ఈ మూవీ లో సముద్ర ఖని, బోమన్ ఇరానీ, ప్రభాస్ శ్రీను, సత్య, వీ టి వీ గణేష్ , సప్తగిరి ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు. డల్ గా సాగుతున్న సినిమా ను కాస్తో కూస్తో నిలబెట్టింది అంటే థమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అనే చెప్పాలి. జోనర్ హారర్ కామెడీ అని చెప్పినా ఇందులో అంత హారర్ లేదు...కామెడీ కూడా లేదు. ప్రభాస్ న్యూ లుక్ కోసం చూడాలి తప్ప ఇందులో ఇతర అంశాలు పెద్దగా ఆకట్టులేకపోయాయి.

                                                                                                                                                        Full Viewరేటింగ్ :2 .5 /5

Tags:    

Similar News