వివాదాలు లోడింగ్!

Update: 2026-08-01 09:19 GMT

పాన్ ఇండియా హీరో యష్ గతంలోఎప్పుడూ వివాదాల్లో ఇరుక్కోలేదు. యష్ నటిస్తున్న కొత్త సినిమా టాక్సిక్ విషయంలో మాత్రం మొదటి నుంచి వివాదాలు ఆయన చుట్టూ తిరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఇందులోని హింస...శృతిమించిన శృంగార సన్నివేశాలు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన కంటెంట్ అంతా కూడా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరక్కించిన ఈ టాక్సిక్ మూవీకి సంబంధించి శనివారం నాడు కీలక అప్డేట్ ఇచ్చారు. అది ఏంటి అంటే ఈ సినిమా ట్రైలర్ ఆగస్ట్ 8 న విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి యష్ న్యూ లుక్ తో కూడిన పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమా ఆగస్ట్ 26 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఫస్ట్ ఈ సినిమాను ఈ ఏడాది మార్చి లో విడుదల చేయాలని నిర్ణయించారు..తర్వాత దీన్ని జూన్ కు మార్చారు.

                                  Full Viewఇప్పుడు ఫైనల్ గా ఆగస్ట్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. టాక్సిక్ సినిమాకు రవి బ్రసూర్ సంగీతం అందిస్తుండగా కే వి ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థగా ఉంది. ఇటీవల విడుదల అయిన రామాయణ ట్రైలర్ లో రావణ పాత్రలో యష్ డామినేట్ చేశాడు. రాముడి పాత్రధారి రణబీర్ కపూర్ కంటే రావణ పాత్రనే ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంది. దీంతో ఇప్పుడు టాక్సిక్ ట్రైలర్ పైనే ఇప్పుడు అందరి కళ్ళు ఉన్నాయి. పైగా ఇది ఇంకా ఎన్ని కొత్త వివాదాలకు కారణం అవుతుందో చూడాలి. కెజీఎఫ్ రెండు భాగాలతో యష్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ దక్కించుకున్నాడు. టాక్సిక్ మూవీ లో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. ఇందులో నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి, తారా సుతారియా లు వివిధ పాత్రల్లో కనిపించనున్నారు.

Tags:    

Similar News