Full Viewగోపీచంద్ మలినేని, బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దాదా సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. గతంలో వీళ్ళిద్దరూ కలిసి చేసిన వీరసింహారెడ్డి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. దాదా సినిమా ప్రమోషన్స్ కు చిత్ర యూనిట్ రంగం సిద్ధం చేసింది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. దీపావళి సందర్భంగా ఈ మేరకు ఒక లుక్ కూడా విడుదల చేశారు. దాదా ధమాకా నవంబర్ 13 న ప్రారంభం అవుతుంది అని వెల్లడించారు. బాలకృష్ణ, నర్గిస్ ఫక్రి మీద తెరకెక్కించిన స్పెషల్ సాంగ్ ను ఫస్ట్ ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 24 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కు థమన్ మ్యూజిక్ అందిస్తుంటే ...వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మాత గా ఉన్నారు.

                                   దాదా సినిమా షూటింగ్ లో బాలకృష్ణ గాయపడ్డ సంగతి తెలిసిందే. దీంతో సినిమా ముందు ప్రకటించిన తేదీకి వస్తుందా రాదా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ బాలకృష్ణ కొద్దిరోజుల విరామం తర్వాత సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. దీంతో షెడ్యూల్ ప్రకారమే సినిమా ముందు ప్రకటించినట్లు డిసెంబర్ 24 న విడుదల కానుంది. ఫస్ట్ సింగిల్ ...అది కూడా స్పెషల్ సాంగ్ ఈ సినిమాకు ఎలాంటి జోష్ తీసుకొస్తుందో చూడాలి. డిసెంబర్ 24 నే అక్కినేని నాగార్జున హీరోగా నటించిన కింగ్ 100 సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు కిరణ్ అబ్బవరం నటించిన రియాలిటీ సినిమా కూడా ఇదే డేట్ ఫిక్స్ చేసుకుంది. మరో వైపు బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ కింగ్ కూడా ఇదే డేట్ కు వస్తోంది.

Tags: