విజయదేవరకొండ, రష్మిక కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే భారీ అంచనాలు ఉంటాయి. గతంలో వీళ్ళిద్దరూ కలిసి చేసిన రెండు సినిమాల్లో ఒకటి బ్లాక్ బస్టర్ హిట్ అయితే...రెండవ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఆ రెండు సినిమాలు ఏంటి అంటే ఒకటి గీతా గోవిందం...మరొకటి డియర్ కామ్రేడ్. విజయదేవరకొండ, రష్మిక పెళ్లి తర్వాత చేసిన సినిమా రణబాలి కావటంతో ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు భారీగా పెరిగాయి. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 16 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం మిశ్రమ స్పందలకే పరిమితం అయింది. ఇప్పుడు ఈ మూవీ ఓటిటిలోకి వస్తోంది.
Full Viewఈ పిరియాడిక్ యాక్షన్ డ్రామా నవంబర్ 13 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఇది అందుబాటు ఉంటుంది అని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ సంగీత ద్వయం అజయ్-అతుల్ మ్యూజిక్ అందించారు. రణబాలి మూవీ లో విజయదేవరకొండ సింగనమల బొబ్బిలి రణబాలి గా కనిపిస్తే...రష్మిక జయమ్మ పాత్రలో ఆకట్టుకుంది. సినిమాలో వీళ్లిద్దరి నటన బాగానే ఉన్నా కూడా కథలో ఎక్కువ భాగం దర్శకుడు కరువు ప్రాంతాలు...తిండిలేక బక్కచిక్కిన మనుషులను పదే పదే చూపించటంతో ప్రేక్షకులకు ఎక్కువ శాతం ఒక డాక్యుమెంటరీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది.