అమెజాన్ లో స్ట్రీమింగ్

Update: 2026-05-22 11:57 GMT

Full Viewతరుణ్ భాస్కర్ ఈ మధ్య కాలంలో దర్శకత్వంపై కంటే ఎక్కువగా నటనపైనే ఫోకస్ పెడుతున్నాడు. ఆయన హీరోగా నటించిన సినిమాలు ఇటీవల కాలంలో వరసగా బాక్స్ ఆఫీస్ కు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. డోనాల్డ్ ట్రంప్ రెండవసారి అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ముఖ్యంగా ఇండియాకు చెందిన ఎంతో మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులతో పాటు విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో ట్రంప్ టార్గెట్ గానే ఈ సినిమా తీసుతున్నట్లు చిత్ర యూనిట్ ప్రచారం చేయటంతో గాయపడ్డ సింహం మూవీ పై మంచి హైప్ క్రియేట్ అయింది. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని దక్కించుకోలేకపోయింది అనే చెప్పాలి.

                                        ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ జోడిగా ఫరియా అబ్దుల్లా తో పాటు మానస చౌదరిలు హీరోయిన్లుగా నటించారు. మే 1 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలాంటి హంగామా లేకుండా ఓటిటి లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ లో ఇప్పుడు ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు తో పాటు హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో ఇది అందుబాటులో ఉంది అని అమెజాన్ వెల్లడించింది. కొత్త దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ కామెడీ డ్రామా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. మరి ఇప్పుడు ఓటిటి లో ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటుందో చూడాలి. ఈ సినిమాలో ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి కూడా నటించాడు. 

Tags:    

Similar News