పుష్ప 2 సెకండ్ సింగిల్ డేట్ ఫిక్స్

Update: 2024-05-23 07:06 GMT

అల్లు అర్జున్ ఫాన్స్ కు ఇక పండగే పండగ. చిత్ర యూనిట్ వరసపెట్టి అప్ డేట్స్ ఇస్తుండటంతో ఈ వేసవిలో వాళ్లకు కావాల్సినంత వినోదం అందుతోంది. ఇప్పటికే పుష్ప 2 సినిమాకు సంబంధించి విడుదల అయిన పుష్ప పుష్ప సాంగ్ రికార్డు లు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు శ్రీవల్లి వంతు వచ్చింది. సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి అంటూ రష్మిక మందన్న ప్రోమో వీడియో విడుదల చేసింది చిత్ర యూనిట్.

ది కపుల్ సాంగ్ పేరుతో ఇది మే 29 ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాలకు విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా దేశ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు పుష్ప 2 పై కూడా అదే స్థాయి అంచనాలు ఉన్నాయి. ఆగస్ట్ 15 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అందుకే చిత్ర యూనిట్ వరసపెట్టి ఈ సినిమా వార్తల్లో ఉండేలా ప్లాన్ చేస్తోంది. పుష్ప ఫస్ట్ పార్ట్ లో అల్లు అర్జున్ యాక్షన్ తో పాటు సినిమాలోని పాటలు కూడా విజయంలో కీలక పాత్ర దక్కించుకున్నాయనే చెప్పాలి. 

Tags:    

Similar News