ట్రెండ్ కు అనుగుణంగా నాని కూడా కొత్త స్టైల్ ప్రచారం స్టార్ట్ చేశాడు. హీరో నానికి ఎన్నికలకు సంబంధం ఏమిటి అన్నదే కదా మీ డౌట్. ఇప్పుడు ఎక్కడ చూసిన ఎన్నికల హడావుడి తప్ప మరొకటి కనిపించటం లేదు కదా. అందుకే నాని కూడా ఎన్నికల ప్రచారం తరహాలో తన కొత్త సినిమా హాయ్ నాన్న ప్రచారం స్టార్ట్ చేశాడు.అందులో భాగంగానే కాస్త డిఫరెంట్ గా ఎన్నికల ప్రచారం తరహాలో ఈ సినిమా కొత్త విడుదల తేదీ ప్రకటించాడు.
వాస్తవానికి తొలుత ఈ సినిమా ను డిసెంబర్ 21 న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ డిసెంబర్ 22 న ప్రభాస్ సలార్ సినిమా విడుదల ఉండటంతో హాయ్ నాన్న విడుదల తేదీ మార్చక తప్పని పరిస్థితి ఎదురైంది. డిసెంబర్ 7 నుంచి మీ ప్రేమ, ఓటు మాకే ఇవ్వాలి అంటూ న్యూ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నాని కి జోడి గా మృణాల్ ఠాకూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. దసరా సినిమా తర్వాత విడుదల అవుతున్న నాని కొత్త సినిమా ఇదే.