అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్

Update: 2026-01-30 10:34 GMT

సంక్రాంతి సినిమాలు అన్నీ వరసగా ఓటిటి లోకి క్యూ కడుతున్నాయి. ఈ సంక్రాంతి సీజన్ లో అందరి కంటే చివరిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వానంద్ సినిమా నారీ నారీ నడుమ మురారి అందరి కంటే ముందు ఓటిటి లోకి వస్తోంది. ఓటిటి డేట్ అనౌన్స్ మెంట్ ముందు రాజాసాబ్ సినిమా దే వచ్చినా కూడా ఓటిటి లో ఫస్ట్ స్ట్రీమింగ్ అయ్యేది మాత్రం శర్వానంద్ సినిమానే. ఫిబ్రవరి తొమ్మిదిన రాజాసాబ్ ఓటిటి లోకి వస్తుంటే....నారీ నారీ నడుమ మురారి మూవీ మాత్రం ఫిబ్రవరి నాలుగు నుంచే ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణే దక్కింది.

                                Full Viewఈ సారి సంక్రాంతికి పోటీ ఎక్కువగా ఉండటం వల్ల చివరిలో వచ్చిన ఈ సినిమాకు సరిపడినన్ని థియేటర్లు దక్కలేదు.. దీంతో వసూళ్లపై ప్రభావం పడింది. చిన్న బడ్జెట్ సినిమాల విషయానికి వస్తే అందరూ ముక్తకంఠంతో సంక్రాంతి విన్నర్ గా శర్వానంద్ సినిమాకే ఓటు వేశారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో శర్వానంద్ కు జోడిగా సంయుక్త మీనన్, సాక్షి వైద్య నటించారు. మరో వైపు ఈ మూవీ లో నరేష్, సత్య, వెన్నెల కిషోర్ లు కూడా కామెడీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చాలా కాలం తర్వాత హీరో శర్వానంద్ ఈ సినిమాతో హిట్ కొట్టాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని రాబట్టిన ఈ మూవీ ఇప్పుడు తెలుగు తో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

Tags:    

Similar News