విడుదల తేదీ కూడా చెప్పేశారు

Update: 2026-01-26 15:38 GMT

విజయదేవరకొండ, రష్మిక మందన జంటగా నటిస్తున్న సినిమా టైటిల్ ప్రకటించింది చిత్ర యూనిట్. ప్రస్తుతం విడి 14 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీకి రణబాలి అనే పేరు ఫిక్స్ చేశారు. అంతే కాదు ఈ మూవీని 2026 సెప్టెంబర్ 11 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. టైటిల్ ప్రకటనతో ఒక వీడియో కూడా విడుదల చేశారు.గతంలో విజయదేవరకొండతో కలిసి టాక్సీవాలా మూవీ తెరకెక్కించిన దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.

                                     Full Viewబ్రిటిష్ వాళ్ళు భారతీయులపై చేస్తున్న అకృత్యాలను ఓ యోధుడు ఎలా ఎదురించాడు అనే స్టోరీ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆర్నాల్డ్ వోస్లూ ఈ సినిమాలో బ్రిటిష్ అధికారిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు బాలీవుడ్ ద్వయం అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. రణబాలి మూవీ తెలుగు తో పాటు హిందీ, తమిళ్,మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. గత ఏడాది విజయదేవరకొండ కింగ్డమ్ సినిమా తో ప్రేక్షుకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని సాధించటంలో విఫలం అయింది.

Tags:    

Similar News