సెకండ్ ఇన్నింగ్స్ లో దూకుడు

Update: 2026-01-26 14:03 GMT

మంచు మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్ దూకుడు మీద ఉంది. ఒక వైపు ఇతర హీరోలతో కలిసి సినిమాలు చేస్తూనే సోలో ప్రాజెక్ట్ ల ను కూడా ట్రాక్ లో పెట్టాడు. గత ఏడాది ప్రేక్షుకుల ముందుకు వచ్చిన భైరవం సినిమాతో పాటు మిరాయి సినిమాలో కూడా మంచు మనోజ్ కు మంచి పవర్ ఫుల్ పాత్రలు దక్కాయి. ముఖ్యంగా మిరాయి లో అయితే మంచు మనోజ్ పాత్ర ప్రేక్షుకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తేలింది. ఈ హీరో ఇప్పుడు డేవిడ్ రెడ్డి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా లో మంచు మనోజ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ చిత్ర యూనిట్ సోమవారం నాడు విడుదల చేసింది. ఈ లుక్ చూస్తే ఒకింత భయం వేసేలే అంది అని చెప్పొచ్చు. దీంతో ఈ సినిమాలో మనోజ్ మరో సారి పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు స్పష్టం అవుతోంది.

                               Full View‘నాలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే పాత్ర. ఎంతో క్రూరమైన, క్షమాగుణం లేనిది’ అని ఈ న్యూ లుక్ తో షేర్ చేశారు. స్వాతంత్రానికి పూర్వం జరిగిన కథ ఇది అని చిత్ర యూనిట్ చెపుతోంది. బ్రిటిష్‌ వారిపై పోరాడిన ‘డేవిడ్‌ రెడ్డి’ అనే యోధుడి కథగా రానుంది...అయితే ఇది పూర్తి ఫిక్షనల్ కథ అని స్పష్టం చేశారు. ఈ సినిమా కోసం ‘వార్‌ డాగ్‌’ అనే బైక్‌ను రూపొందించారు. దీని బరువు దాదాపు 700 కేజీలు. ఈ సినిమాలో ఆ బైక్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. డేవిడ్ రెడ్డి మూవీ లో మంచు మనోజ్ కు జోడిగా మరియా నటించనుంది. ఈ సినిమా తెలుగు తో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.

Tags:    

Similar News