పాన్ ఇండియా స్థాయిలో వరస అవకాశాలు దక్కించుకుంటూ విజయాలు సాధిస్తోంది రష్మిక మందన్న. ఇప్పటికే ఆమె చేతిలో ఎన్నో ప్రాజెక్టులు ఉండగా..ఇప్పుడు మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ వచ్చి చేరింది. విజయదేవరకొండ తో కలిసి నటిస్తున్న రణబాలి మూవీ షూటింగ్ ను ఇటీవలే రష్మిక పూర్తి చేసుకుంది. పెళ్లి తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇదే కావటంతో ఈ మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరో వైపు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ మైసా లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలోని దిగ్గజ గాయనీ గాయకుల్లో ఎం ఎస్ సుబ్బలక్ష్మి ది ప్రత్యేక స్థానం. ఆమె జీవిత చరిత్రపై సినిమా ఉంటుంది అని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అధికారికంగానే ఈ సినిమాపై ప్రకటన వచ్చేసింది.
సెప్టెంబర్ 16 న ఎం ఎస్ సుబ్బలక్ష్మి 110వ జయంతి కావటంతో చెన్నైలో ఈ సినిమా గ్రాండ్ గా లాంచ్ కానుంది. ఎం ఎస్ సుబ్బులక్ష్మి పాత్రను రష్మిక మందన్న పోషించనుంది. చెన్నై లో జరిగే కార్యక్రమానికి హీరో కమల్ హాసన్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. ఈ సినిమాకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. తొలుత ఈ బయో పిక్ కోసం సాయి పల్లవి పేరు ను పరిశీలించారు. కానీ ఫైనల్ గా ఛాన్స్ మాత్రం రష్మిక కు దక్కింది. ఎం ఎస్ సుబ్బులక్ష్మి అమ్మ పేరుతో ఈ బయో పిక్ తెరకెక్కనుంది. చెన్నై లో జరిగే ఈవెంట్ లో ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.