శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో వచ్చిన సామజవరగమన మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ మూవీ 2023 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబినేషన్ లో మరో సినిమాకు రంగం సిద్ధం అయింది. ఈ సినిమా కు ఫ్యామిలీ ప్యాక్ అనే టైటిల్ పెట్టారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ ను విడుదల చేయటంతో పాటు సినిమా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. ఈ మూవీ 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫుల్ ఫన్ తో వస్తున్నాం అని...సంక్రాంతికి అంతా సిద్ధంగా ఉండాలి అంటూ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వినాయకచవితి సందర్భంగా ఈ చిత్ర అప్ డేట్ ఇచ్చింది.

                                          Full Viewఫ్యామిలీ ప్యాకెడ్ సంక్రాంతి అంటూ చిత్ర యూనిట్ ఈ ఫన్ అండ్ ఎంటర్ టైన్మెంట్ మూవీ పై అంచనాలు పెంచే ప్రయత్నం చేసింది. ఇందులో శ్రీ విష్ణుకు జోడిగా సాక్షి మహాదోల్కార్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇతర కీలక పాత్రల్లో నరేష్, అభిరామి, మాస్టర్ రేవంత్ (బుల్లిరాజు ) తదితరులు కనిపించనున్నారు. శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు కాంబినేషన్ తిరిగి రిపీట్ అవుతుండంతో ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఫలితం రాబట్టే అవకాశం ఉంది అనే అంచనాలు ఉన్నాయి.

Tags: