దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నాని కాంబినేషన్ లో వస్తున్న ప్యారడైజ్ మూవీకి పెద్ద ఎత్తున బజ్ ఉంది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన దసరా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని రాబట్టిన సంగతి తెలిసిందే. ఉత్తర అమెరికా లో ప్యారడైజ్ మూవీ సేల్స్ మొదలు పెట్టారో లేదో వెంటనే ఈ సినిమా లక్ష డాలర్ల వసూళ్లు రాబట్టింది. అత్యంత వేగంగా ఉత్తర అమెరికా లో ప్రీ సేల్స్ లో ఈ ఫీట్ సాధించినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ఒక లుక్ రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 24 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో హీరో నాని ఊరమాస్ జడల్ లుక్ లో హంగామా చేయనున్నాడు. ఇందులో నానికి జోడిగా కయాదు లోహర్ నటించింది.