టాలీవుడ్ లో జోష్ తీసుకొచ్చిన సినిమా ఇరుముడి. గత కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న హీరో రవి తేజకు సూపర్ డూపర్ హిట్ ని ఇచ్చింది ఈ మూవీ. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 226 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించింది. అయ్యప్ప స్వామి భక్తులతో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులు ఈ సినిమాను పెద్ద ఎత్తున ఆదరించారు. ముఖ్యంగా తండ్రీ, కూతురి సెంటిమెంట్ ఇందులో బాగా వర్క్ అవుట్ అయింది.

                                      Full Viewబాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్మురేపిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటి లోకి వస్తోంది. ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో ఇది స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 18 నుంచి తెలుగు తో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోఅందుబాటులో ఉంటుంది అని వెల్లడించారు. ఈ సినిమా లో రవి తేజ కు జోడి గా ప్రియా భవాని శంకర్ నటించింది. రవి తేజ కూతురి పాత్రలో నక్షత్ర తన నటనతో ఆకట్టుకుంది. ఇరుముడి సినిమా ఒక్క రవి తేజ కే కాకుండా టాలీవుడ్ కు కూడా కొత్త ధైర్యాన్ని ఇచ్చింది అనే చర్చ పరిశ్రమలో సాగుతోంది.

Tags: