బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ దక్కించుకున్న సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ. ఈ మూవీ 25 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 260 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. దర్శకుడు వెంకీ అట్లూరి, తమిళ హీరో సూర్య కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీపై మొదటి నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని రాబట్టింది. ముఖ్యంగా ఇందులో హీరో సూర్య తో పాటు హీరోయిన్ మమిత బైజు, రాధిక ల నటనకు ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఓన్ చేసుకోవటంతో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. థియేట్రికల్ రన్ ముగించుకున్న ఈ సూపర్ హిట్ సినిమా ఇప్పుడు ఓటిటి లోకి వస్తోంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ మూవీ సెప్టెంబర్ 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కి వచ్చేందుకు సిద్ధం అయ్యింది. ఒరిజినల్ తమిళ్ తో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సైతం ఈ చిత్రం అందుబాటులోకి రానుం