Full View'భీమ్లా నాయక్' సెకండ్ సింగిల్ వచ్చింది. చిత్ర యూనిట్ ముందు ప్రకటించినట్లుగానే దసరాకు ఈ పాటను విడుదల చేసింది. 'అంత ఇష్టం ఏందయ్యా..' అంటూ సాగే పాట బాగా ఆకట్టుకుంటుంది. ప్రముఖ గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను సింగర్ చిత్ర ఆలపించారు. ఇందులో పవన్ కల్యాణ్ పోలీసు ఆఫీసర్‌గా టైటిల్ రోల్ పోషిస్తుండగా.. రానా కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్- రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న చిత్రం 'భీమ్లా నాయక్'. మలయాళం హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియం'కు తెలుగు రీమేక్ అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్‌కు జోడిగా నిత్యామీనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.