కాపు నేస్తం కింద 490 కోట్లు విడుద‌ల‌

Update: 2021-07-22 10:02 GMT

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గురువారం నాడు కాపు నేస్తం ప‌థ‌కం కింద ల‌బ్దిదారుల ఖాతాల్లోకి 490.86 కోట్ల రూపాయ‌లు విడుద‌ల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన 3,27,244 మంది మహిళలకు 490.86 కోట్ల రూపాయలు చేరాయి. కాపుల్లో నిరుపేదలుగా ఉన్న వారికి 'వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం' అందిస్తున్నామని సీఎం జ‌గ‌న్ తెలిపారు. అర్హులైన కాపు మహిళలకు ఏటా రూ.15 వేలు ఆర్ధిక సాయం, ఐదేళ్లలో మొత్తం రూ.75 వేల ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు.

ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వెనక్కి తగ్గకుండా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. వరసగా రెండో ఏడాది కూడా ఈ పథకం అమలు చేస్తున్నామని, మేనిఫెస్టోలో చెప్పకపోయినా 'వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం'కు శ్రీకారం చుట్టామన్నారు. వివక్షకు తావు లేకుండా, అవినీతి లేకుండా ఈ పథకం అమలు చేస్తున్నామని, ప్రతి అర్హుడికి మంచి జరగాలని, అలాంటి వారికి మిస్ కాకూడదని చెప్పారు. అర్హత ఉన్న కాపు మహిళలు గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.

Tags:    

Similar News