కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపి అధిష్టానం తాజాగా ఆమెకు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈనాడులో ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. దీనిపై విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.
‘పురంధేశ్వరి ఈరోజు ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూతో, అందులో రాజధాని, ప్రభుత్వ పనితీరు అంశాలపై వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఆమె జాతీయ నాయకురాలో, జాతి నాయకురాలో పూర్తిగా స్పష్టమైంది.’ అని పేర్కొన్నారు.దీనిపై ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.